»Sandalwood Smuggler Veerappans Daughter Vidhyarani Contesting Krishnagiri Tamil Nadu Lok Sabha Constituency
Elections 2024 : లోక్ సభ ఎన్నికల్లో వీరప్పన్ కూతురు.. ఏ పార్టీ తరుఫున అంటే ?
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు మూడు రాష్ట్రాలకు భయానికి పర్యాయపదంగా ఉండేవాడు. చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా తనను అంత తొందరగా ఎవరూ మరచిపోలేదు.
Elections 2024 : గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు మూడు రాష్ట్రాలకు భయానికి పర్యాయపదంగా ఉండేవాడు. చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా తనను అంత తొందరగా ఎవరూ మరచిపోలేదు. త్వరలో జరుగబోవు ఎన్నికల్లో ఆయన కుమార్తె విద్యారాణి వీరప్పన్ కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. విద్యారాణి తన తండ్రి ఇమేజ్ను మార్చుకోవడమే కాకుండా ఆ ప్రాంత భవితవ్యాన్ని కూడా మార్చాలనుకుంటోంది. విద్యారాణి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమెకు ఎన్టీకే పార్టీ టికెట్ ఇచ్చింది. విద్యారాణి గెలిస్తే విద్యరాణికి, ఆమె పార్టీ NTK ఇద్దరికీ ఇదే తొలి అరంగేట్రం అవుతుంది.
వీరప్పన్ కుమార్తె విద్యారాణి వృత్తిరీత్యా న్యాయవాది. 2020 నుంచి బీజేపీతో కలిసి రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. భారతీయ జనతా యువమోర్చాకు ఉపాధ్యక్షురాలిగా, తమిళనాడులోని బీజేపీ బ్యాక్వర్డ్ ఫ్రంట్‌కు ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. విద్య ఇప్పుడు బీజేపీని వీడి ఎన్టీకేలో చేరి ఎన్టీకే టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తోంది. విద్యారాణి బెంగళూరులో న్యాయవిద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె పాఠశాల నడుపుతోంది. ఇక్కడ 60 మంది పిల్లలు చదువుతున్నారు. విద్య తన తండ్రి వీరప్పన్‌ను స్ఫూర్తిగా భావిస్తుంది. తన తండ్రి ఎంత తీవ్రమైన నేరస్థుడిగా భావించినా తనతో పాటు ఉన్నవారు తన గురించి చెప్పే మాటలు వింటుంటే తన జీవితం స్ఫూర్తినిస్తుందని తెలిపింది.