»Dubai Due To Rains Flights Between India And Dubai Have Been Cancelled
Dubai: వర్షాల కారణంగా.. భారత్, దుబాయ్‌ల మధ్య విమానాల రద్దు
దుబాయ్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా దుబాయ్ ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ఎప్పుడు రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Dubai: Due to rains, flights between India and Dubai have been cancelled
Dubai: దుబాయ్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా దుబాయ్ ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ఎప్పుడు రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై మోకాలిలోతు నీరు నిండిపోయింది. ఈ భారీ వర్షాల కారణంగా భారత్-దుబాయ్ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లే 15 విమానాలు, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు సివిల్ ఏవియేషన్ శాఖ తెలిపింది. మిగతా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
దుబాయ్ మెత్తం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రాకపోకలు అన్ని స్తంభించిపోయాయి. కార్లు, ఇల్లు నీటమునిగాయి. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇంకా వడగండ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు.