Ramoji Rao's funeral was complete with official ceremonies
Ramoji Rao: ఈనాడు గ్రూప్ ఆఫ్ చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంతిమ కార్యక్రమం పూర్తి అయింది. రామోజీరావు కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. ఆయన పెద్ద కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పాడే మోశారు. చివరిగా ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.
అధికారిక లాంఛనాల మధ్య, పోలీసుల గౌరవ వందనంతో రామోజీ అంత్యక్రియలు ముగిశాయి. రామోజీరావు అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు ఆయన్ను చివరి చూపు చూసుకున్నారు. ఆయన అంతిమ కార్యక్రమానికి రామోజీ సంస్థల ఉద్యోగులు వందలాదిగా తరలివచ్చారు. అంతిమ సంస్కారాల్లో నారా లోకేశ్, ఎర్రబెల్లి దయాకర్రావు, నామా నాగేశ్వరరావు, వి.హనుమంతరావు, కేఆర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సుజనా చౌదరి, వెనిగండ్ల రాము, జూపల్లి కృష్ణారావు, అరికెపూడి గాంధీ, తదితరులు పాల్గొన్నారు.