శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. శంకర్ మార్క్ పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రాబోతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది.
Ram Charan in Rajahmundry.. 'Game Changer' special song planning?
Ram Charan: ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాలో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి కొడుకులుగా విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. తండ్రి పాత్ర రాజకీయ నేపథ్యంలో ఉండనుంది. కొడుకు పాత్ర ఐఏఎస్ ఆఫీసర్ అని ముందు నుంచి చెబుతునే ఉన్నారు. అలాగే.. తండ్రి పేరు అప్పన్న అని.. కొడుకు పేరు రామ్ నందన్ కుమార్ అని అంటున్నారు. అప్పన్న పాత్రకు నత్తి కూడా ఉంటుందని టాక్. దీంతో అప్పన్నగా, రామ్ నందన్గా రామ్ చరణ్ అదరగొట్టడం ఖాయం. ప్రస్తుతం ఐఏఎస్ రామ్ నందన్‌కు సంబంధించిన గేమ్ చేంజర్ కీలక షెడ్యూల్‌ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెరకెక్కిస్తున్నాడు శంకర్.
ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటికి రాగా.. కలెక్టర్ రామ్ నందన్గా చరణ్ అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ షెడ్యూల్‌తో చరణ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కానుందని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆ సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారట. మామూలుగానే శంకర్ సినిమా పాటలు ఓ రేంజ్లో ఉంటాయి. అలాంటిది స్పెషల్ సాంగ్ అంటే, నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందనే చెప్పాలి. అయితే.. ఈ సాంగ్‌లో చరణ్‌తో చిందేసే బ్యూటీ ఎవరనేది తెలియాల్సి ఉంది. కానీ తమన్ మాత్రం అదిరిపోయే ట్యూన్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. సినిమాలో ఈ పాటనే హైలెట్‌గా నిలిచేలా కంపోజ్ చేస్తున్నాడట. మరి గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో చూడాలి.