గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది. ప్రధానమంత్రి మోదీతో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అకీరా హైట్ ఎంత? మోడీతో ఏం మాట్లాడాడు అనేది ఆసక్తికరంగా మారింది.
What is the height of Pawan's successor Akira? What did he actually talk to Modi?
Akira Nandan: పవన్ వారసుడు అకీరా నందన్ కటౌట్ చూస్తే.. వావ్ అనాల్సిందే. సూపర్ కటౌట్తో హీరోగా లాంచ్ అవడానికి రెడీగా ఉన్నాడు అకీరా. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి తండ్రితోనే కనిపిస్తున్నాడు అకీరా. దీంతో అకీరాకు సంబంధించిన పోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలాగే.. అకీరా హైట్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించింది. అకీరా నందన్ ఆరడుగుల 4 అంగుళాలు ఉంటాడని చెప్పుకొచ్చింది. అయితే.. అకిరా నందన్ అంత హైట్ అవ్వడానికి కాంప్లాన్ ఎన్నిసార్లు ఇచ్చారు అని అడిగితే.. అసలు కాంప్లాన్ అనేది తాగలేదని చెప్పుకొచ్చింది. అకీరా ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తింటాడని, ఇద్దరు తల్లిదండ్రుల నుంచి వచ్చిన జెనెటిక్స్ అంత హైట్ రావడానికి ఉపయోగపడ్డాయని తెలిపింది.
ఇక మోడీ అకిరాతో ఏం మాట్లాడాడు అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. దీనిపై కూడా రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. మేము అకిరా, పీఎం మోడీ మధ్య జరిగిన సంభాషణ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాం.. అసలు మోడీ అకీరాతో ఏమన్నారు? అని ఒక నెటిజన్ అడిగాడు. దీనికి రేణు దేశాయ్ స్పందిస్తూ.. ఇంత హైట్ ఉన్నావ్ కదా, బాస్కెట్ బాల్ ఆడడం లేదు ఎందుకు? అని అడిగితే అకిరా సిగ్గు పడ్డాడు.. అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఏదేమైనా.. అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఎదురు చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్.