నిజామాబాద్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పాంగ్రా మాజీ సర్పంచ్, బీసీ స్థానిక నాయకులు అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం, అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.