మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో సోమవారం నిర్వహించిన పిల్లలమర్రి బాలోత్సవం నాలుగో జాతరలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. సైన్సు ఆధారిత స్టాళ్లతో పాటు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు, ఆటలు, పాటల పోటీలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలు రెండు రోజుల పాటు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.