NDL: డోన్ పట్టణం 16వ వార్డు విడోస్ కాలనీలో రూ.32.80 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ కాలువల నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పనులతో వర్షాకాల నీటి నిల్వ సమస్యలు తొలగి, మెరుగైన రవాణా, పరిశుభ్రమైన వాతావరణం కలుగుతుందని తెలిపారు. డోన్ అభివృద్ధికి ఇది మరో ముందడుగన్నారు.