BDK: కొత్తగూడెం కార్పొరేషన్ 19వ డివిజన్లో ఇవాళ ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి పర్యటించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుందని, డివిజన్ అభివృద్ధి కోసం రానున్న కార్పొరేషన్ ఎన్నికలలో ఐక్యమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని తెలిపారు.