AP: రైతులు వ్యాపారులుగా మారాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రైతులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన రైతు నేస్తం ఫౌండేషన్ వార్షికోత్సవానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరై మాట్లాడారు. పదేళ్లుగా ఫౌండేషన్ను విజయవంతంగా నిర్వహిస్తున్న యడ్లపల్లి వెంకటేశ్వర రావుకు, అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.