»Janasena Leader Nagababu Tweet Viral In Ap Politics
Nagababu : మీసం మెలేస్తూ ఫోటోను పోస్ట్ చేసిన నాగబాబు.. అందుకేనట!
ఎన్నికల ఫలితాలు మెగా కుటుంబంలో చెప్పలేనంత సంతోషాన్నినింపాయి. ఈ నేపథ్యంలో మీసం మెలేస్తూ ఉన్న ఫోటోతో పాటు నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Janasena Leader Nagababu : జనసేన నాయకుడు, మెగా సోదరుడు నాగబాబు చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మీసం మెలేస్తున్న ఫోటోతో పాటు ఆయన దానికి ఒక క్యాప్షన్‌ను సైతం రాశారు. ‘ ఈ మీసం తిప్పింది జనసేనాని 100శాతం ట్రైక్ రేట్ కొట్టాడని కాదు. కూటమి అఖండ విజయం సాధించిందని కాదు. ధర్మ పోరాటంలో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరఫున నేను గర్వంగా ఈ మీసం తిప్పుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి తమ్ముడి వెంటే నాగబాబు(Nagababu) నడిచారు. దాన్ని బలోపేతం చేసేందుకు తనవంతు సహకరించారు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి జనసేన తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి ఎన్నికల ఫలితాలు మాత్రం పవన్ కళ్యాణ్ సత్తాను చూపించాయి. స్వయంగా మోదీయే పవన్‌ను కొనియాడారు. పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు.. తుపాను అంటూ కితాబిచ్చారు. 2019 ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన జనసేన ఈ సారి వంద శాతం సీట్లను నెగ్గడంతో మెగా కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయింది. దీంతో ప్రస్తుతం నాగబాబు(Nagababu) చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
ఈ మీసం తిప్పింది ‘జనసేనాని’ 100% Strike Rate కొట్టాడని కాదు,
కూటమి అఖండ విజయం సాధించింది అని కాదు
ఈ ధర్మపోరాటం లో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరపున నేను గర్వంతో తిప్పుతున్నాను ఈ మీసం…!#jaijanasena#JAIPAWANKALYANpic.twitter.com/Dg3bKNZk2Z