»Tension In Gudivada Attack On Kodali Nanis House With Chicken Eggs
Eggs Attack : కొడాలి నాని ఇంటిపై కోడి గుడ్లతో దాడి
ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత గుడ్లతో దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Eggs Attack on Kodali Nanis House : తెలుగు దేశం యువ నాయకుడు గుడ్ల దాడికి దిగారు. గుడివాడలో(Gudivada ) మాజీ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపై కోడి గుడ్లతో దాడి చేశారు. ఎన్నికలకు ముందు కొడాలి నాని ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ డిమాండ్‌ను నెరవేర్చాలంటూ వారంతా డిమాండ్ చేశారు. రాళ్లు, కోడిగుడ్లతో(Eggs) నాని ఇంటిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కొడాలి నాని(Kodali Nani) ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పలుమార్లు టీడీపీ, జనసేన నాయకులపై తీవ్రంగా విమర్శలు చేశారు. అనేక సార్లు వారిపై దుమ్మెత్తిపోశారు. తిట్ల దండకాలు చదివారు. అవి అనేక సార్లు నెట్లో వైరల్ అయ్యాయి. అంతా చిత్రంగా చూశారు కూడా. ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపైనా వ్యక్తిగతంగా దూషణలకు దిగారు. ఈ క్రమంలో ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓడిపోతే రాజకీయ సన్యాసం(Political asceticism) తీసుకుంటానంటూ ప్రకటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన టీడీపీ అభ్యర్థి రాము చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన విసిరిన సవాల్‌ను ఆయనే నెరవేర్చుకోవాలంటూ తెలుగు యువత ఆందోళనకు దిగారు.