మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌పై తీవ్రంగా ఆరోపణలు చేశారు.
Kodali Nani: మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌పై తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆనాడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడచి పదవి నుంచి తప్పించగా.. నేడు జూనియర్ ఎన్టీఆర్‌ను తొలగించుకునేందుకు అల్లుడు లోకేష్ కోసం బాలకృష్ణ పార్టీని సర్వనాశనం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన జూ.ఎన్టీఆర్‌ను ఏం చేయలేరని నాని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో నన్ను ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ల కల నెరవేరదన్నారు. గుడివాడ ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. వైసీపీలో టికెట్లు రాని వాళ్లు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని.. పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎవరూ వెళ్లడం లేదని కొడాలి నాని వెల్లడించారు. ఓడిపోయే వారికి టికెట్ ఇవ్వనని జగన్ ముందుగానే చెప్పారని కొడాలి నాని తెలిపారు. తనకి టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయిన వైసీపీ అధికారంలోకి రావడానికి మాత్రమే పనిచేస్తానని తెలిపారు.