»Pawan Should Be Protected By Janasiniks Kodali Nani
Kodali Nani: పవన్ ను జనసైనికులే రక్షించుకోవాలి: కొడాలి నాని
టీడీపీతో పొత్తు పెట్టుకొని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనసైనికులను నిండా ముంచాడు అని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. ఇక ఆయన్ను జనసైనికులే రక్షించుకోవాలి అని వెల్లడించారు.
Pawan should be protected by Janasiniks Kodali Nani
Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali nani) పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను ఉద్దేశించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏపీ(AP)లో తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. పవన్ కల్యాణ్‌ను జనసైనికులే కాపాడు కోవాలని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని జనసేన తప్పు చేసిందని, ఈ ఎన్నికలు అయిపోయిన తరువాత పవన్‌కు అర్థం అవుతుందని జోస్యం చెప్పారు. జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని లేదంటే పార్టీ పని అయిపోయినట్లే అని అన్నారు. చంద్రబాబు గురించి పవన్ కల్యాణ్‌కు సరిగ్గా తెలియదు అని త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటాడని పేర్కొన్నారు.
చంద్రబాబు, నాదేండ్ల మనోహార్ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి, అధికారం కావాలి తప్ప ఎవరి ప్రయోజనం అవసరం లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. 3 శాతం ఓట్లు ఉన్న తన సామాజిక వర్గానికి 30 సీట్లు, 20 శాతం ఉన్న పవన్ వర్గానికి మాత్రం 24 సీట్లే ఇచ్చాడని విమర్శించారు. అందులోనూ 10 సీట్లు కచ్చితంగా ఓడిపోయేవని వివరించారు. అలాంటి సీట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి లేదా తీసుకోవడానికి పవన్ కైనా సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.