గత మార్చిలో తన స్నేహితుడు మాథిస్బోను వివాహం చేసుకున్నారు హీరోయిన్ తాప్సీ పన్ను. తన భర్త విషయమై ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన భర్త గురించి ఆమె ఏం చెప్పారంటే..?
Taapsee : హీరోయిన్ తాప్సీ పన్ను గత మార్చిలో తన చిరకాల మిత్రుడు మాథిస్బోను వివాహం చేసుకున్న సంగతి అందరకీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆమె తన వివాహం గురించి కాని, తన భర్త గురించిగాని ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా జరిగిన ఓ ఇంటర్య్వూలో మాత్రం తన భర్త గురించి ఆమె కొన్ని విషయాలను పంచుకున్నారు.
కాలేజీ రోజుల నుంచి తాను కొంత మంది అబ్బాయిలతో డేటింగ్ చేశానని థాప్సీ(Taapsee) చెప్పుకొచ్చారు. అయితే మాథిస్బోలో తాను పర్ఫెక్ట్ మ్యాన్ని చూశానని అన్నారు. తమది ఒక్క రోజులో చిగురించిన ప్రేమ కాదని, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపారు. మాథిస్‌తో చేసిన ప్రయాణంలో తాను చాలా సెక్యూర్డ్‌గా ఫీలయ్యానని అన్నారు. అందుకనే ఏళ్ల తమ స్నేహాన్ని చివరికి వివాహ బంధంగా మార్చుకున్నామంటూ చెప్పుకొచ్చారు.
తాప్సీ పన్ను భర్త మాథిస్బో(Mathisbo) ఇంటర్నేషనల్ బ్యాట్మింటన్ క్రీడాకారుడు. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించారు. 2010 నుంచి 2012 వరకు మూడు సూపర్సిరీస్లను గెలుచుకున్నారు. 2020లో ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ అయ్యారు. తర్వాత భారత జాతీయ బ్యాట్మింటన్ పురుషుల డబుల్స్ విభాగానికి కోచ్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే 2013లో తాప్సీకి, ఆయనకు పరిచయం అయ్యింది. దాదాపుగా 11 ఏళ్లపాటు రిలేషన్లో ఉన్న వీరు ఎట్టకేలకు 2024లో పెళ్లి చేసుకున్నారు.