ఈ మధ్య స్టార్ హీరో, హీరోయిన్లంత పెళ్లి బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ బ్యూటీ తాప్సీ కూడా పెళ్లికి రెడీ అవుతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించింది అమ్మడు.
Taapsee: టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు సినిమా ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు అవుతున్నాయి. ఇటీవలె వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. అలాగే.. దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ రెడ్డి వివాహం కూడా జరిగింది. ఇక ఇప్పుడు సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను కూడా పెళ్లికి రెడీ అవుతోంది. ఝుమ్మంది నాదం తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఇక బడా హీరోలతో నటించింది. అయితే.. కొన్నాళ్ల తర్వాత టాలీవుడ్లో ఆఫర్లు తగ్గడంతో.. బాలీవుడ్‌కి వెళ్ళిపోయింది అమ్మడు. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. ఇక సినిమాలతో పాటు మ వ్యవహారంలోను హాట్ టాపిక్ అవుతునే ఉంది తాప్సీ.
రీసెంట్‌గానే తన లవ్ మ్యాటర్ రివీల్ చేసింది తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోనుతో పదేళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్నట్టుగా చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో వచ్చె నెలలోనే రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ వేదికగా వీరి వివాహం జరుగనుందని ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లి కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరవుతారని, సినీ తారలు ఎవరూ హాజరుకావడం లేదని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి వార్తలపై స్పందించింది తాప్సీ. పెళ్లి మాట చెప్పకుండా.. తన వ్యక్తిగత విషయాలకు తాను ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్‌లో కూడా ఇవ్వను.. అని చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లి వార్తను సస్పెన్స్‌లో పెట్టినట్టయింది. మరి అమ్మడు పెళ్లి గురించి ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.