శ్రియ హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఈ మధ్యలో వచ్చిన ఎందరో హీరోయిన్లు అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. శ్రియ మాత్రం సౌత్‌తో పాటు నార్త్‌లోను జెండా పాతేసింది. పెళ్లైనా తర్వాత కూడా సినిమాలు చేస్తోంది.
Shriya: హాట్ బ్యూటీ శ్రియ శరణ్ గురించి అందరికీ తెలిసిందే. నాలుగు పదుల వయసులోను క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అది కూడా పెళ్లై, పిల్లలు పుట్టాక కూడా. అంతేకాదు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. తెలుగులో మెగాస్టార్ మొదలుకొని.. దాదాపుగా అందరు స్టార్ హీరోలతోను శ్రియ రొమాన్స్ చేసింది. 22 ఏళ్ల సినీ కెరీర్లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను అనుభవించింది. అయితే 2018లో ఆండ్రూని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు పాప కూడా ఉంది.. కూతురు పేరు రాధ. అయినా గ్లామర్ విషయంలో శ్రియ తగ్గేదేలే అంటోంది. రోజు రోజుకి అమ్మడి అందం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు అన్నట్టుగా ఉంటుంది.
సినిమాలు కూడా అలాగే చేస్తోంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయింది శ్రియ. ఇదిలా ఉంటే.. శ్రియ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. హీరోయిన్లంటే ఏదో ఓ రకంగా అవమానాలకు గురవుతునే ఉంటారు. శ్రియకు కూడా అందుకు అతీతం కాదు. తాజాగా శ్రియ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోని లేడీ యాక్టర్స్‌ను, హీరోయిన్లను ఎందుకు పనికిరారు అన్నట్టుగా చూస్తారు. ఇప్పటికీ కూడా ఇది జరుగుతూనే ఉంది. కొన్నిసార్లు ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలా బాధేస్తుంది. వాటిని మరిచిపోయేందుకు స్నేహితులతో గడుపుతాను. అయితే.. ఇదంతా చూసిన తర్వాత నా భర్త కూడా దీని పై స్పందిస్తుంటాడు. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు.. అని ఓదారుస్తూ ఉంటాడు. కానీ నేను ఇప్పుడు ఓ తల్లిని అనే విషయం కూడా మరిచిపోతున్నారు. నా భర్త, కూతురుతో కలిసి బయటకు వెళ్లినప్పుడు కూడా జనాలు నన్ను అదోలా చూసినట్టు చూస్తారు.. ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయినా నాకు నచ్చినట్టే ఉంటానని.. చెప్పుకొచ్చింది శ్రియ.