»Operation Valentine Budget And Business What Is The Target
Operation Valentine: ‘ఆపరేషన్ వాలెంటైన్’ బడ్జెట్ అండ్ బిజినెస్.. టార్గెట్ ఎంతంటే?
గద్దలకొండ గణేష్ తర్వాత సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. అలా అని.. కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. కొత్తగా ట్రై చేస్తునే ఉన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.
'Operation Valentine' Budget and Business.. What is the target?
Operation Valentine: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ ఫిల్మ్ ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్‌కు రెడీ అయింది. మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేశాడు. ఈ ఏరియల్ యాక్షన్ డ్రామా ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా 2 గంటల 4 నిమిషాల రన్ టైం లాక్ చేసుకుంది. ఖచ్చితంగా ఈ రన్ టైం సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే భారీ బడ్జెట్ పెట్టరేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే.. విజువల్స్, క్వాలిటీ, VFX ఆ రేంజ్లో ఉన్నాయి. కానీ ఈ సినిమాకు కేవలం 42 కోట్లు మాత్రమే ఖర్చయిందట.
మరో 8 కోట్లు ప్రమోషన్స్ కోసం ఖర్చు పెట్టాము.. మొత్తం 50 కోట్లలో సినిమాని పూర్తిచేసాము అని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమా బిజినెస్ డీల్ కూడా క్లోజ్ అయింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. రిలీజ్‌కి ముందే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లిపోయిందని చెప్తున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే 23 కోట్లకు పైగా వచ్చినట్టు సమాచారం. ఇక థియేట్రికల్ బిజినెస్ 17 కోట్ల వరకు జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ అవుతోంది. మరి.. ఈ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా? బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటాడో చూడాలి.