నిజమేనా? సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చేస్తున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. చిరు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏంటి మ్యాటర్?
Megastar: భోళా శంకర్ వంటి ఫ్లాప్ తర్వాత భారీ సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. బింబిసారతో సాలిడ్ హిట్ ఒట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించి.. ప్రస్తుతం ఒక సాంగ్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ సాంగ్‌ను గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఇంటి సెట్లో చేస్తున్నట్టుగా సమాచారం. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా.. టాక్‌తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబట్టింది. పండుగాడు, సూర్య భాయ్ తర్వాత రమణ గాడుగా రచ్చ చేశాడు మహేష్ బాబు.
ఈ సినిమాలో మహేష్ పేరు రమణ. అందుకే.. సినిమాలో తనను తాను రమణ గాడిగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈ సినిమాలో తన ఫ్యామిలీతో కలిసి ఒక పెద్ద ఇంట్లో ఉంటాడు మహేష్ బాబు. తన తండ్రి, మమయ్యలతో కలిసి ఉంటాడు. ఇప్పుడు అదే ఇంట్లో విశ్వంభర షూటింగ్ జరుగుతోందట. మెగాస్టార్, త్రిష పై సాంగ్ షూట్ చేస్తున్నారట. శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ సినిమాలో చాలా కీలకం అని తెలుస్తోంది. ఈ సెట్ హైదారాబాద్ శివార్లలో ఉందని టాక్. ఇకపోతే.. ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసిన విశ్వంభర.. సంక్రాంతి టార్గెట్‌గా దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను 2025 జనవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. మరి విశ్వంభర ఎలా ఉంటుందో చూడాలి.