»Ranveer Singh A Girl Child Should Be Born Like Deepika
Ranveer Singh: దీపికలాంటి ఆడపిల్ల పుట్టాలి
బాలీవుడ్ స్టార్ దంపతులు దీపికా, రణ్వీర్ సింగ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని దీపికా తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే తనకు దీపిక లాంటి ఆడపిల్ల కావాలని రణ్వీర్ ఆశపడుతున్నట్లు చెప్పిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ దంపతులు దీపికా, రణ్వీర్ సింగ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని దీపికా తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే తనకు దీపిక లాంటి ఆడపిల్ల కావాలని రణ్వీర్ ఆశపడుతున్నట్లు చెప్పిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలిసారి దీపికా, రణవీర్లు కలిసి రామ్ లీలా చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. తర్వాత 2018లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ జంటకు ప్రస్తుతం బాలీవుడ్ నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కోరుకున్న విధంగానే పెళ్లయిన కొన్నాళ్లకు తల్లిదండ్రులం అవుతాం. నాకు మీ కోడలు లాంటి అందమైన ఆడపిల్ల కావాలి. అది చాలు నా జీవితానికి. నేను రోజూ తన చిన్ననాటి ఫొటోలు చూస్తుంటాను. అందులో దేవతలా ఉంటుంది. నాకు పుట్టబోయే పాప పేరు ముందే ఆలోచించి పెట్టుకున్న. శౌర్యవీర్ సింగ్ అని పేరు పెట్టుకుంటే మీకు అభ్యంతరం ఏమైనా ఉందా? అని రణ్వీర్ ఓ షోలో పేర్కొన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.