మేడారం జాతరలో ఏర్పాటు చేసిన హుండీని అధికారులు లెక్కిస్తున్నారు. అందులో ఫేక్ కరెన్సీ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఉద్దేశపూర్వకంగానే వేసినట్లు తెలుస్తుంది.
Medaram Jatara Hundi is being counted. A currency with Ambedkar's figure printed on it
Medaram Jatara Hundi: తెలంగాణ(Telangana)లో అత్యంత వైభవంగా మేడారం జాతర ముగిసింది. నేడు మేడారం మహాజాతరలో ఏర్పాటు చేసిన హుండీలను లెక్కిస్తున్నారు అధికారులు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఈ లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 518 హుండీలు ఏర్పాటు చేశారు. వాటిని పదిరోజుల పాటు లెక్కించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్న భక్తులు వారి కానుకగా వెండి, బంగారం, నగదును సమర్పించుకున్నారు. ఇక హుండిలో ఫేక్ నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కానీ అవి ఉద్దేశపూర్వంగా అచ్చువేసిన నోట్లు అని తెలుస్తుంది.
ఈ నకిలీ కరెన్సీ నోట్లపై అంబేద్కర్(Ambedkar) పటాన్ని అచ్చు వేసి ఉంది. తరువాత నోట వెనుక భాగంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ వేయాలని చేపట్టిన ఉద్యమానికి సంబంధించిన సమాచారం, అలాగే కరెన్సీ నోట్లకు సంబంధించిన కొన్ని వివరాలను కూడా ప్రింట్ చేశారు. దీంతో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ అనే నినదించే ఉద్యమకారులే ఈ పని చేశారని స్పష్టం అవుతుంది. ఇక ఈ లెక్కింపు కోసం భారీ భద్రతతో పాటు సీసీ కెమరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈసారి ఆదాయం పెరుగుతుంది అధికారు భావిస్తున్నారు. ఏ రోజు ఆదాయం ఆరోజే బ్యాంకులో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.