VSP: విశాఖలో సోమవారం జరిగిన ‘సరస్ ఎగ్జిబిషన్’ ప్రారంభోత్సవంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు. మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా 1995లోనే చంద్రబాబు నాయుడు మహిళా సమాఖ్యలను స్థాపించారని ఆయన అన్నారు. 250 స్టాళ్లు ఏర్పాటు కావడం, మహిళల భారీ పాల్గొనడం హర్షణీయమని తెలిపారు.