MBMR: జిల్లా వ్యాప్తంగా చివరి విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మహబూబ్నగర్ జిల్లాలో 122 గ్రామపంచాయతీలకు, 914 వార్డులకు నేడు పోలింగ్ జరగనుంది. ఈపాటికి 10 గ్రామపంచాయతీలకు, 231 వార్డులకు ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించారు. మొత్తంగా 440 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2584 మంది వార్డు సభ్యులు పోలింగ్ సందర్భంగా బరిలో నిలిచారు.