ప్రకాశం జిల్లాలో ఇవాళ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ పర్యటించనున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఆర్థిక సంస్థల బడ్జెట్ అంచనాలపై కమిటీ సమీక్షించనుంది. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.