MBNR: సమాజంలో ప్రజల పట్ల ప్రేమ, క్షమా, సేవలే యేసుక్రీస్తు యొక్క ముఖ్య సందేశం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎంపీ చర్చిలో నిర్వహించిన సెమీ క్రిస్టమస్ వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని కలవరి కొండను పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.