»125 Feet Statue Of Ambedkar In Vijayawada January 24th 2024 Unveiled
Vijayawada:లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాం..అప్పుడే ఆవిష్కరణ!
ఏపీలోని విజయవాడలో నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణకు తేదీని ఖారారు చేశారు. ఈరోజు సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో భాగంగా ప్రకటించారు. దీంతోపాటు విగ్రహం ఎత్తును కూడా 206 అడుగులకు పెంచుతామన్నారు.
125 feet statue of Ambedkar in Vijayawada january 24th 2024 unveiled
విజయవాడలో జనవరి 24, 2024న 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం(Ambedkar statue) ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. ఈ విగ్రహం స్వరాజ్ మైదాన్‌లోని అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రజల మధ్య ఐక్యత, సౌభ్రాతృత్వం, సామాజిక సామరస్యాన్ని పటిష్టం చేయడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఏ పనిని కూడా అజాగ్రత్తగా ఉంచవద్దని సీఎం సిబ్బందికి సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులను వేగవంతం చేసి గడువులోగా ప్రారంభోత్సవం జరిగేలా చూడాలని అధికారులను కోరారు.
Ambedkar was one of the most remarlkable Indians 🇮🇳 of all times!
Long awaited 125 feet tall Babasaheb Ambedkar statue is ready for Inauguration in Vijaywada Andhra Pradesh. Proud moment for the entire India.pic.twitter.com/1OoH7KTW0N
స్మృతి వనం ప్రాంగణాన్ని సస్యశ్యామలం చేయాలని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, కన్వెన్షన్ సెంటర్‌ను కూడా పని చేసేందుకు సిద్ధంగా ఉంచాలన్నారు. దీంతోపాటు ప్రాజెక్టు పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి(ap cm jagan mohan reddy) అధికారులకు సూచించారు. మొత్తం 206 అడుగుల పొడవుతో 81 అడుగుల పీఠంపై డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని, మొత్తం ప్రాజెక్టు సామాజిక న్యాయ భావనను ప్రతిబింబిస్తుందని అధికారులు ఆయనకు తెలియజేశారు.
కృష్ణలంక(krishna lanka) ప్రాంతంలో నిర్మించిన వరద రక్షణ గోడ వెంబడి చేపడుతున్న సుందరీకరణ పనులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పార్కు, వాకింగ్ ట్రాక్‌కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వై శ్రీ లక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.