»Cm Jagan Attack Of Stones On Cm Break The Bus Trip
CM Jagan: సీఎంపై రాళ్లపై దాడి.. బస్సు యాత్రకు బ్రేక్
ఏపీ సీఎం జగన్‌పై నిన్న రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన గాయపడగా.. వైద్యులు తనను విశ్రాంతి తీసుకోవాలంటూ సూచనలు చేశారు. దీంతో ఈరోజు జరిగే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు.
CM Jagan: ఏపీ సీఎం జగన్‌పై నిన్న రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన గాయపడగా.. వైద్యులు తనను విశ్రాంతి తీసుకోవాలంటూ సూచనలు చేశారు. దీంతో ఈరోజు జరిగే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈరోజు గుడివాడలో జరగాల్సిన మేమంతా సిద్ధం సభ రేపటికి వాయిదా పడింది. ఇకపై బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. నిన్న విజయవాడలోని సింగ్‌నగర్ ప్రాంతంలో దాభాకొట్ల సెంటర్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తుండగా ఏపీ సీఎంపై దుండగులు రాయితో దాడిచేశారు. దీంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. రాయి దెబ్బకు కనుబొమ్మపైన శరీరం చిట్లిపోయింది.
జగన్‌తో పాటు ఎమ్మెల్యే వెల్లంపల్లి సైతం గాయపడ్డారు. వెంటనే బస్సులోని వైద్య సిబ్బంది జగన్‌కు ప్రథమ చికిత్స చేసి విజయవాడలోని జీజీహెచ్‌లో మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం జగన్ కేసరపల్లిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. బస్సు స్సెక్యూరిటీలో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇండ్ల వద్ద పోలీసులు భద్రత పెంచారు. సీఎం జగన్‌పై దాడిని ప్రధాని మోదీ ఖండిచారు. తర్వగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.