Why is February 29 this year? What is special about a leap year?
Leap Year: భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందని అందరికీ తెలుసు. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేయడానికి 365 రోజుల, 5 గంటలు, 48 నిమిషాలు, 46 సెకన్లు పడుతుంది. దీన్ని లెక్కెస్తే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి 24 గంటలు అదనంగా అంటే ఒక రోజు వస్తుంది. అలా 366 రోజులు ఉండే సంవత్సరాన్నే లీప్ ఇయర్ అంటాం. అలా 2024 ఏడాదికి 366 రోజులుంటాయి.
లీప్ డే కలపపోతే పరిస్థితి ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు ఒక రోజు, అంటే 24 గంటల సమయం పడుతుంది. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాలు పడుతుంది. అంటే పావు రోజు సమయం కిందకి వస్తుంది. పావు రోజుని కలపడం కుదరదు కనుక నాలుగేళ్ల పాటు నాలుగు పావు రోజులు కలిపితే ఒక రోజు అవుతుంది. ఫిబ్రవరిలో తక్కువ రోజులు ఉండటంతో అదనంగా వచ్చిన ఒక రోజుని ఫిబ్రవరిలో నెలలో పెట్టారు. ఈ లీప్ డే లేకపోతే, రైతులు సరైన సీజన్లో నాటడానికి ఇబ్బంది పడవచ్చు. కాలాన్ని ఆధారంగా చేసుకొని చేసే చాల పనుల్లో గందగోళం ఏర్పడే అవకాశం ఉంది.
దీనిపై నాసా ఏం చెబుతుందంటే.. నాలుగేళ్లకొకసారి ఈ అదనపు రోజు కలపకపోతే రుతువుల్లో మార్పులొస్తాయని నాసా చెబుతోంది. వేసవి కాలం మధ్యలో శీతాకాలం వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగేళ్లకి ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు వచ్చే విధంగా గ్రెగెరియన్ క్యాలెండర్ను రూపొందించారు. ఇది కూడా లెక్కల ఆధారంగా ఉంటుంది. ఈక్వినాక్స్ అయనాంతం వంటి వార్షిక సంఘటనలకు నెలలు కనెక్ట్ అయ్యేలా చూసుకోవడానికి ఈ అదనపు రోజు ఉపయోగిస్తారని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తెలిపింది.