Rohit Sharma: వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మాంచి ఊపు మీదుంది రోహిత్ సేన. రేపటి మ్యాచ్‌లో లంకను మట్టికరిపిస్తే ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంటుంది. రేపటి మ్యాచ్, తన గురించి రోహిత్ శర్మ్ (Rohit Sharma) మీడియాతో మాట్లాడారు.
తాను క్రికెటర్‌గా నిలదొక్కుకోవడానికి వాంఖడే స్టేడియం కారణం అని రోహిత్ శర్మ (Rohit Sharma) అంటున్నారు. ఇక్కడ ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. ముంబై జనం అభిమానం తనను కట్టి పడేస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు మీ ముందు ఉన్నానంటే అందుకు కారణం వాంఖడే అని చెప్పారు. స్టేడియంలో ప్రతి స్టాండ్‌కు ప్రత్యేకత ఉంది. ఉత్తరం వైపున ఉండే స్టాండ్ ప్రసిద్ధి చెందింది. ఎక్కువ అభిమానులు అటు వైపు నుంచే వస్తారని తెలిపారు.
మరో రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ (Rohit Sharma) ఉన్నాడు. 2019లో క్రిస్ గేల్ 15 ఇన్నింగ్స్ ఆడి 56 సిక్సులు కొట్టాడు. ఈ ఏడాది రోహిత్ శర్మ 56 సిక్సులు కొట్టి.. గేల్‌తో సమంగా నిలిచాడు. 2015లో సౌతాఫ్రికాకు చెందిన డివిలియర్స్ 18 ఇన్నింగ్స్‌ల్లో 58 సిక్సులు కొట్టాడు. అంటే ఇప్పటివరకు 58 సిక్సులే రికార్డ్. రోహిత్ శర్మ మరో 3 సిక్సులు కొడితే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టిస్తాడు.
రోహిత్ శర్మ (Rohit Sharma) కూతురు సమైరా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి భారత జెర్సీ వేసుకుంది. జెర్సీ వెనక తండ్రి పేరు ఉంది. హోలోవీన్ సందర్భంగా సమైరా రెడీ అయిన ఫోటోను రోహిత్ భార్య రితికా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టారు.