PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జూలపల్లి మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తేలుకుంట కేజీబీవీ, పెద్దాపూర్ మోడల్ స్కూల్, జూలపల్లి తహసిల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. రోగులకు సరియైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.