SRD: కంగ్టి మండలం చౌకన్పల్లి గ్రామంలో మహిళల సాధికారతకు ఫ్రీ టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నేడు ప్రారంభిస్తున్నట్లు మండల సమాఖ్య అధ్యక్షురాలు మహానంద తెలిపారు. స్థానిక సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో నెల రోజులు, 30 మంది యువతులకు టైలరింగ్ పై గ్రామ స్వరాజ్య సంస్థ ద్వారా మహిళలకు కుట్టు శిక్షణతో పాటు యాభై శాతం సబ్సిడీ ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామన్నారు.