»Ugadi Festival When Did The Ugadi Festival Start The Specialty Of Green
Ugadi Festival: ఉగాది పండుగ ఎప్పుడు ప్రారంభమైంది? పచ్చడి విశిష్టత?
హిందూ ప్రధాన పండుగల్లో కొత్త సంవత్సరం ఉగాది ఒకటి. ప్రతి ఏడాది ఛైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటే.. ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండుగ, వివిధ ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు. అసలు ఉగాదిని ఎందుకు జరుపుకుంటారు? దీని పచ్చడి విశిష్టత ఏంటి? తెలుసుకుందాం.
కొన్ని శతాబ్దాల ముందు నుంచే ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. రాజ వంశం 230BC నుంచి 220AD వరకు ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం, ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్షుకు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం, ‘యుగం’ అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయణాల మధ్య సంయుతం యుగం(ఏడాది)కాగా, ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది నుంచే వసంత బుుతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం, ఛైత్ర మాసం శుక్ల పక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మ దేవుడికి అప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు. ఛైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను, మంచి, చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి. ఉప్పు-మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు-తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు – బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం – ఈ తియ్యని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం – సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. వగరు– పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది.వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు – బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం – ఈ తియ్యని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం – సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. వగరు– పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది.