WNP: ఎక్సైజ్ నేరాలకు సంబంధించి జప్తు చేసిన 6 వాహనాలకు మంగళవారం ఉదయం 11 గంటలకు కొత్తకోట ఎక్సైజ్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే ఆసక్తి గలవారు రూ.5 వేలు డిపాజిట్ చేయాలన్నారు. మరిన్ని వివరాల కోసం కార్యాలయ పని వేళల్లో కొత్తకోట ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.