TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 10 వేల మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 24,238 పాఠశాలల్లో 1.08లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. టీచర్ల సర్దుబాటు చేస్తున్న నేపథ్యంలో గణాంకాలను విద్యాశాఖ సేకరిస్తోంది. అయితే గతేడాది కంటే ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 24 వేల మంది విద్యార్థులు తగ్గారు.