RR: షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డ్ ఆఫీసర్స్ కాలనీ ఫేజ్-2 లో సీసీ రోడ్ల పనులను కాంగ్రెస్ నాయకులు నరేష్, ఖదీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్ మున్సిపాలిటీలోని ప్రతి కాలనీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, మున్సిపాలిటీ అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్తున్నారన్నారు.