ADB: జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ఆదిలాబాద్‌లోని జడ్పీ హాలులో ఘనంగా నిర్వహించారు. ఇవాళ నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్య క్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గుస్సాడీ నాట్యం ప్రత్యేకంగా నిలిచింది.