SRCL: రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ ప్రహ్లాద పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర బుధవారం ఘనంగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం దీపాలను వేలిగించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ కమిటీ అధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.