కాకినాడ: తిమ్మాపురం, కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన వరుస దొంగతనాల కేసుల్లో కాకినాడలోని సూర్యారావుపేట లచ్చిరాజు వీధికి చెందిన లంక వీరవెంకటదుర్గా శివ గణేష్‌ను బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు తిమ్మా పురం ఎస్సై గణేష్ తెలిపారు. నిందితుని నుంచి సుమారు 10 గ్రాములు బంగారం, కేజీ వెండి ఆభరణాలు, రూ.18,196 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.