KDP: జిల్లాలో వరి రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ తెలిపారు. సాధారణ రకం వరికి క్వింటాకు రూ. 2,369, ఏ-గ్రేడ్ రకానికి రూ. 2,389 ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ-క్రాప్, ఈ-కేవైసీతో పాటు తమ పేర్లను నమోదు చేసుకున్న రైతులు మాత్రమే కొనుగోలుకు అర్హులని ఆమె తెలిపారు.