WGL: భద్రకాళి ఆలయాన్ని మేయర్ గుండు సుధారాణి బుధవారం రాత్రి సందర్శించారు. బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని, భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో సునీత, అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవాలయాన్ని సందర్శించిన ముత్తైదువులకు మేయర్ వాయినాలు ఇచ్చారు.