విశాఖ: సరిగ్గా 20 నెలల క్రితం మూసివేసిన డాక్ యార్డ్ బ్రిడ్జి పోర్టు యాజమాన్యం సహకారంతో పునర్నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. ఈనెల 11వ తేదీ నుంచి రాకపోకలు చేయవచ్చని పేర్కొన్నారు. దాదాపు రూ. 20 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు పూర్తి చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు.