ఎన్టీఆర్: ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు నియోజకవర్గం త్వరలోనే NTR జిల్లాలోకి రానుంది. జిల్లాల మార్పుకై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెల్లడించిన వివరాల మేరకు దీనిపై గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. అలాగే నూజివీడు డివిజన్లో ఉన్న చింతలపూడి, లింగపాలెం మండలాలను జంగారెడ్డిగూడెం డివిజన్లోకి చేర్చేలా ప్రతిపాదనలు వచ్చాయి.