JGL: సౌదీ అరేబియాలోని జెడ్డాలో రాయికల్ పట్టణానికి చెందిన సుతారి ధర్మయ్య (50) రాత్రి రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ జరిగిందని సోషల్ మీడియా ద్వారా అక్కడి స్థానికులు తెలిపారు. దురదృష్టవశాత్తు మరణం సంభవించినట్లు దుబాయ్ వాసులు చెబుతున్నారు. అక్కడే ఉన్న తెలుగు వారు సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.