బాక్సాఫీస్ వార్ అనేది మీడియా క్రియేట్ చేసిన పదం అని నటుడు అడివి శేష్ చెప్పాడు. టాక్సిక్, డెకాయిట్ సినిమాలు పోటీ పడనున్నాయని వస్తోన్న వార్తలపై ఆయన స్పందించాడు. రెండు సినిమాలు ఒకే రోజు వస్తే వాటిలో ఒకటి ఫ్లాప్ అవుతుందనేది అబద్దమని, గతంలో ఒకరోజు వచ్చిన సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నాడు. ఈ రెండు సినిమాలు హిట్ అవుతాయని నమ్ముతున్నానని తెలిపాడు.