SS: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళల కోసం అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న హిందూపురంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ తెలిపారు. టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18-30 ఏళ్ల మహిళలు అర్హులని తెలిపారు.