TG: ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియదు కానీ.. HYD న్యూ బోయిన్పల్లిలో ఆఫ్రికన్ నత్తలు కనిపించాయి. మిలిటరీకి చెందిన మూడెకరాల విస్తీర్ణంలోని పచ్చని వనంలో ఆఫ్రికన్ నత్తలు కనిపించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇవి ఆకులు, చిగుళ్లు, కాండం, పూతపిందెలనే కాకుండా ఏకంగా వృక్షాలే నేలకొరిగేలా చేస్తాయి.