GNTR: తెనాలిలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ముగిశాయి. పోటీల్లో జిల్లా బాలుర హ్యాండ్‌బాల్ జట్టు ఆల్ రౌండ్ ప్రతిభను చాటి విన్నర్స్‌గా నిలిచింది. ఈ మేరకు మహీంద్రా మోటార్స్ ఎండీ మధుసూదనరాజు, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు క్రీడాకారులను అభినందించారు.