NDL: బనగానపల్లె మండలం పసుపుల గ్రామ సమీపంలో ఉన్న శ్రీ గుండం మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 17న కార్తీక సోమవారం పూజలకు రావాలని బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డిని గ్రామ ప్రజలు ఆహ్వానించారు. మంగళవారం బీసీ రాజారెడ్డి చేతుల మీదుగా గుండం మల్లికార్జున స్వామి ఆహ్వాన పత్రికను విడుదల చేయించారు. పూజలకు హాజరవుతున్నట్లు బీసీ రాజారెడ్డి తెలిపారు.