BHPL: రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని అందమైన రథంలో ఊరేగింపుగా బయలుదేరారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ స్వామివారిని కొండవైపు తీసుకెళ్తూ.. భక్తులు జైకారాలు చేశారు.