ప్రకాశం: కంభం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎస్ఐ నరసింహారావు ఆధ్వర్యంలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం రోడ్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, హెల్మెట్ ధరించడం వంటి అంశాలను పరిశీలించారు. నియమాలను ఉల్లంఘించిన వారికి హెచ్చరికలు జారీ చేసి, రహదారి భద్రత పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ అన్నారు.